వెంకటగిరికి సమీపంలోని మన్నవరంలో ఎన్బీపీపీఎల్ఐ కి కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. 600ఎకరాలు నిరుపయోగంగా ఉన్నట్లు గుర్తించారు. వీటిని తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తే కొత్త కంపెనీలకు కేటాయించాలని నిర్ణయించారు. తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, ఉన్నతాధికారులు ఎన్బీపీపీఎల్ఐ ప్రతినిధులతో సోమవారం చర్చించగా ఇది కేంద్రం పరిధిలోని అంశమని కంపెనీ ప్రతినిధులు చెప్పారు.