రైల్వే బెడ్ షీట్లు దొంగిలిస్తున్న ప్రయాణికులు (వీడియో)
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా వైభవంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి తరలి వస్తున్నారు. అయితే, ప్రయాగ్‌రాజ్‌కి సంబంధించి ఓ వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. భక్తుల రద్దీ కారణంగా రైళ్లు కిక్కిరిసి ప్రయాణిస్తుండగా, కొందరు ఇదే అదనుగా రైలులో సామాన్లను చోరీ చేస్తున్నారు. ఓ యువతి రైలు బెడ్ షీట్లను దొంగిలించి సిబ్బందికి పట్టుబడింది.