ప్రత్తి రైతుల జాబితాను సిద్దం చేయండి: జెసి
ప్రత్తి రైతుల జాబితాను సిద్దం చేసి, కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తిచేయాలని జెసి ఎస్. సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. ప్రత్తికొనుగోలు ప్రక్రియను ప్రారంభించేందుకు తన ఛాంబర్లో గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, విజయనగరం జిల్లాలో నవంబరు రెండో వారం నుంచి ప్రత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, వాటికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.