గుర్ల: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని గుర్ల ఎస్సై నారాయణరావు అన్నారు. మండల కేంద్రంలో గల శాఖ గ్రంథాలయంలో గురువారం నిర్వహించిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. గ్రంథాలయాలను విద్యార్థులు వినియోగించుకుని ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. మంచి ఆలోచనలతో భవిష్యత్ కి ఉన్నత బాటలు వేసుకోవాలని కోరారు.