మన్యం జిల్లాలో వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడి సహాయకుల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారిత అధికారి డా. టి కనకదుర్గ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశామని ఆమె చెప్పారు.