కొత్తవలసలో కేంద్రమంత్రి అమిత్ షా పర్యటనకు వ్యతిరేకంగా నిరసన

59చూసినవారు
కొత్తవలసలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనకు వ్యతిరేకంగా ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గాడి అప్పారావు, సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని వారు మండిపడ్డారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు టీవీ రమణ, దేవుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్