విదేశీ పర్యాటకులను కాపాడిన కోస్ట్ గార్డ్స్
విశాఖలోని యరాడ బీచ్‌లో విదేశీ పర్యాటకులకు పెను ప్రమాదం తప్పింది. ఇటలీకి చెందిన ఎనిమిది మంది పర్యాటకులు విహారం కోసం యారాడ బీచ్‌కు శనివారం వచ్చారు. సరదగా గడిపిన ఈ ఎనిమిది మందీ అలల తాకిడి కొట్టుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన కోస్ట్ గార్డు్స, మెరైన్ పోలీసులు వీరిని కాపాడారు. 8 మందినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. కాపాడిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.