అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు అందరూ సహకారం అందించి అడవులను కాపాడడానికి తోడ్పాటు అందించాలని చోడవరం అటవీశాఖ రేంజ్ అధికారి పివి రవివర్మ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ అడవుల్లో అటవీ పనుల మీద తిరిగే స్థానికులు అటవీ సందర్శనకు వెళ్లే వ్యక్తులు నిర్లక్ష్యంగా సిగరెట్టు బీడీ చుట్ట వంటివి కాల్చి పారేయడంతో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని అడవుల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయనీ ఆవేదన వ్యక్తం చేశారు.