అల్లూరి: మార్కెట్ లో విక్రయించిన ధరను కాఫీ రైతులకు చెల్లిస్తాం

62చూసినవారు
అల్లూరి: మార్కెట్ లో విక్రయించిన ధరను కాఫీ రైతులకు చెల్లిస్తాం
గిరిజన రైతులను సేకరించిన కాఫీని బహిరంగ మార్కెట్లో విక్రయించిన ధరను కాఫీ రైతులకు చెల్లిస్తామని అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. గురువారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాఫీకి ముందుగా ఎపెక్స్ కమిటీ నిర్ణయం మేరకు పల్లుకు కిలోకి రూ. 44లు పర్చిమెంట్ కి రూ. 285లు చెల్లించడానికి నిర్ణయించిందన్నారు. కాఫీ రైతులకు కాఫీ ధర తక్కువ చెల్లిస్తారని అపోహ పడకూడదన్నారు.

సంబంధిత పోస్ట్