తమ్మిలేరు కాలువలో దిగి బాలుడు మృతి
ఏలూరులోని గ్జేవియర్ నగర్ కు చెందిన బాలవిజ్ఞేశ్ బుధవారం ఇంటి దగ్గరలో ఉన్న తమ్మిలేరు ఏటిగట్టున సోదరితో కలిసి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో కాలువలోకి దిగి నీట మునిగిపోయాడు. ఇది గమనించిన సోదరి కేకలు వేయగా స్థానికుల సహకారంతో పోలీసులు అక్కడకు చేరుకొని బాలుడ్ని వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.