నరసాపురం: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే
నరసాపురం నియోజకవర్గం లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షం మరియు తూఫాను ప్రభావం వల్ల నరసాపురం మరియు మొగల్తూరు మండలంలో పెదమైన లంక, పేరుపాలెం లో ఉన్న గ్రామస్థులు భయాందోళనలకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకుని అక్కడ నివసిస్తున్న ప్రజలను శనివారం నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పరామర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులతో చర్చించి, ప్రజలకు అందుబాటులో ఉంటాన్నారు.