దుర్గమ్మ సన్నిధిలో ఉండి ఎమ్మెల్యే
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శనివారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో ఆలయ వేద పండితులు ఆయనను ఘనంగా సత్కరించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.