
ఆకివీడు: ఉద్యోగం పేరిట మోసం
ఆకివీడు మండలం మందపాడుకు చెందిన గండికోట వెంకటేశ్ కు దుబాయిలోని సూపర్ మార్కెట్లో ఉద్యోగం ఇప్పిస్తానని కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పెనుమాల గ్రామానికి చెందిన బడుగు రాంబాబు నమ్మ బలికాడు. దీంతో వెంకటేశ్, అతడి స్నేహితుడు దఫదఫాలుగా అతడికి రూ. 4.60 లక్షలు ఇచ్చారు. నెలలు గడిచినా దుబాయి పంపకపోవడంతో వెంకటేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఆకివీడు ఎస్సై నాగరాజు తెలిపారు.