రోడ్డు ప్రమాద ఘటన పై కేసు నమోదు
ఆకివీడు మండలం గుమ్ములూరు రోడ్డులో ఈ నెల 26న గుమ్ములూరు గ్రామానికి చెందిన చొప్పల చిన్న యోహాన్, అతని స్నేహితుడు మోటారు సైకిల్ పై కోళ్లపర్రు గ్రామం వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా బొలేరో వాహనం ఢీకొట్టింది. సంఘటనలో ఇద్దరికీ గాయాలవ్వగా ఆకివీడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు శుక్రవారం తెలిపారు.