పెదవేగి మండలం కూచింపూడిలో సోమవారం పెను ప్రమాదం తప్పింది. గడ్డి లోడుతో వెళుతున్న ట్రాక్టర్ కు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఏలూరు నుంచి బాధరాల వైపు వెళుతున్న గడ్డి ట్రాక్టర్ కూచింపూడికి వచ్చేసరికి గడ్డి లోడ్ ఎక్కువగా ఉండడంతో విద్యుత్ వైరు తెగి గడ్డి ట్రాక్టర్‌పై పడడంతో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకు ఫైర్ సిబ్బంది, గ్రామస్థులు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు.