పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం పెదలంక గ్రామంలో సోమవారం జరిగిన రెవెన్యూ సదస్సులో రైతులు పాల్గొన్నారు. వారు తమ భూ సమస్యలను రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్ కి అర్జీ పత్రాల రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాళ్ల నాగరాజు, ఉపసర్పంచ్ అంకాని నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రైతుల సమస్యలపై సమగ్రమైన చర్చ జరగడం జరిగింది.