ఉంగుటూరు: విద్యుత్ సమస్యలను పరిష్కరించండి: ఎమ్మెల్యే
ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం ఎమ్మెల్యే ధర్మరాజు అధ్యక్షతన నియోజకవర్గం స్థాయిలో విద్యుత్ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఉన్న విద్యుత్ శాఖకు సంబంధించిన పలు సమస్యలను పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావటంతో సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, విద్యుత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.