
బద్వేల్: తల్లీ కొడుకుల మరణంపై విద్యుత్ శాఖ మంత్రి స్పందన
బీ కోడూరు మండలంలో విద్యుత్ షాక్ తో తల్లీ కొడుకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటనపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకే ఇంట్లో తల్లి, కుమారుడి మరణం తనను కలచి వేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పొలాల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.