‘ఎల్సీయూ’.. ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్
దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఎల్సీయూలో భాగంగా వచ్చిన ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా ఆయన కూలీ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఆయన ఎల్సీయూకి సంబంధించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. సినిమాటిక్ యూనివర్స్ ఎలా? ఎక్కడ మొదలైందన్న విశేషాలతో కూడిన ప్రీల్యూడ్ను తీసుకురానున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘ఛాప్టర్ జీరో’ హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన పోస్ట్ చేసిన పోస్టర్ ఆసక్తి రేకేత్తించేలా ఉంది.