రాజకీయం - Politics

Top 10 viral news 🔥
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పలు దేవస్థాన ఈవోల బదిలీ
⚡ ట్రెండింగ్ |

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పలు దేవస్థాన ఈవోల బదిలీ

తిరుమల తిరుపతి లడ్డూ తయారి వ్యవహారం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ముఖ్యమైన దేవస్థానాల్లోని ఈవోలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్నవరం దేవస్థానం ఈవో చంద్రశేఖర్ ఆజాద్‌ను బదిలీ చేసి తిరుపతి ఆర్‌జేసీగా పోస్టింగ్ ఇచ్చింది. జాయింట్ కమిషనర్ NVSVN మూర్తిని ద్వారకా తిరుమల ఈవోగా నియమించింది. ద్వారకా తిరుమల ఈవోగా ఉన్న త్రినాథ్‌రావును సింహాచలం ఆలయ ఈవోగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.