ప్రజల కలలను ద్రవ్యోల్బణం దోచుకుంటుంది: రాహుల్ గాంధీ
పడిపోతున్న ఆదాయాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆత్మగౌరవంతో జీవించాలనే కార్మికుల కలల్ని దోచుకుంటున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ఓ సెలూన్లో షేవింగ్ చేయించుకున్న రాహుల్ అక్కడి క్షరకుడు అజిత్‌తో ముచ్చటించిన వీడియోను Xలో పోస్ట్ చేశారు. రోజంతా కష్టపడినా ఏమీ మిగలడం లేదని అజిత్ చెబుతున్న మాట కష్టపడి పనిచేసే సగటు పేద, మధ్యతరగతి ప్రజల కథను చెబుతోందని పేర్కొన్నారు.