
BREAKING: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
న్యూ ఇయర్ రోజున రైతుల కోసం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులకు రూ.1350కే 50 కిలోల DAP బస్తా ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇందుకోసం రూ.3,850 కోట్లు కేటాయించింది. ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజనను రూ.69,515 కోట్లకు పెంచింది. దీంతో దేశ వ్యాప్తంగా 4 కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరనుంది. ఇందులో 23 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలను భాగస్వామ్యం చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీకి రూ.800 కోట్లు కేటాయించింది.