భారీ వర్షాలు.. వరి పండించే రైతులు ఈ జాగ్రత్తలు పాటించండి
ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల రైతులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ వర్షాల నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రైతులు వరి పంట నష్టపోకుండా చూసుకోవచ్చు. వర్షపు నీరు ఎప్పటికప్పుడు పంట పొలం నుంచి బయటికి వెళ్లేటట్టుగా గట్ల వెంబడి మార్గాలు చేసుకోవాలి. ఎక్కువ రోజులు నీరు వరి పొలాల్లో ఉండటం వలన కుళ్లు తెగులు రావడానికి ఆస్కారం ఉంది. దీని నివారణకు హెక్స కొనజోల్ ను 2 మి.లి ఒక లీటర్ నీటి మోతాదులో కలుపుకొని స్ప్రే చేసుకోవాలి.