డ్రాగన్ ఫ్రూట్ పండించడానికి కావాల్సిన నేలలు ఇవే
డ్రాగన్ ఫ్రూట్ 3 రకాల్లో లభిస్తుంది. ఎరుపు చర్మంతో లోపల ఎర్రని గుజ్జు ఉన్న పండు ఒక రకమైతే, ఎర్రని తోలుతో లోపల తెల్లని గుజ్జు ఉన్న ఫ్రూట్ మరొక రకం కాగా, పసుపు తోలుతో లోపల తెల్లని గుజ్జు ఉన్న ఫలం ఇంకో రకం . ఈ పండ్ల పెంపకానికి అన్ని రకాల నెలలు అనుకూలం. మురుగు నీరు పోయే సౌకర్యం గల ఇసుక నేలలు మంచివి. ఉదజని సూచిక 5.5 నుంచి 6.5 ఉన్న అధిక సేంద్రియ పదార్థం గల నేలలు ఈ మొక్కల పెరుగుదలకు అనుకూలం.