ALERT: ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురవనున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజులు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.