దేవరకద్ర నియోజకవర్గం
శంకర్ సముద్రం పెండింగ్ పనులు పూర్తి చేస్తాం: ఉత్తమ్ కుమార్
కొత్తకోట మండలంలోని శంకర సముద్రంను దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మంత్రులు ఉత్తమ్, జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ప్రాజెక్టు పెండింగ్ పనులతో పాటు కానాయపల్లి పునరావాస పనులు, వేల ఎకరాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకాల మరమ్మతులుకు సంబంధించి వారంలోగా ప్రతిపాదనలు తీసుకువస్తే ఆర్&ఆర్ సమస్యను పరిష్కరించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తిచేస్తామని అన్నారు.