ఎర్ర తోటకూర తింటే హై బీపీ నార్మల్ అవ్వడం ఖాయం
ఆకుకూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందులో ఎర్ర తోటకూర కూడా ఒకటి. దీనిని తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇందులో విటమిన్ ఎ, బి, సి, ఇ లతో పాటు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. తోటకూరలోని పొటాషియం శరీరంలో సోడియం ప్రభావాలను తగ్గిస్తుంది. అధిక రక్తపోటును కంట్రోల్ లో ఉంచుతుంది. హైబీపీ పేషంట్లు ఈ ఆకుకూరను డైట్ లో చేర్చుకుంటే బీపీ నార్మల్ గా ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.