గజ్వేల్: అద్దాల మండపంలో కార్తీక అభిషేక పూజలు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అద్దాల మండపంలో సోమవారం ఘనంగా కార్తిక అభిషేక పూజలు నిర్వహించారు. స్థానిక రామకోటి వ్యవస్థాపకులు, భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఆధ్వర్యంలో మహా శివలింగానికి అభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అంటూ శివ పంచాక్షరి జపిస్తే, సకల పాపాలు తొలగి శుభం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.