గజ్వేల్: ఆలయాల్లో వెదజల్లిన కార్తీక దీపాల కాంతులు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అన్ని శైవ క్షేత్రాలు, ఇతరత్రా దేవాలయాల్లో ఈరోజు సాయంత్రం కార్తీకమాసం చివరి సోమవారం దీపారాధన కార్యక్రమం సందడి నెలకొంది. స్వస్తిక్, ఓం ఆకారంలో మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా స్థానిక పట్టణంలోని రామకోటి ఆలయంలో రామకోటి రామరాజు దంపతుల ఆధ్వర్యంలో కార్తీక దీపాలు వెలిగించారు. దాంతో ఆలయ ప్రాంగణం అంతా కార్తీక దీపాల కాంతులు వెదజల్లాయి.