గజ్వేల్: అమావాస్య రోజున దానం చేస్తే పుణ్యం: కొమురవెల్లి సుధాకర్
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో స్థానిక ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద ఆర్యవైశ్య సీనియర్ కొమురవెళ్లి సుధాకర్ ఆధ్వర్యంలో ఆదివారం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమావాస్య రోజున నిరుపేదలకు ఏ వస్తువు దానం చేసిన పుణ్యం లభిస్తుందని, కార్తీక మాసం చివరి రోజు అమావాస్య సందర్భంగా వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు సిద్ది బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.