ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నాడు "చలో రాజ్ భవన్" ముట్టడి కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ తో కలిసి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ పాల్గొన్నారు. అలాగే కార్పొరేటర్లు కుంభం కిరణ్ కుమార్ రెడ్డి, భూక్యా సుమన్, మేడ్చల్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.