సికింద్రాబాద్: గాంధీలో గుర్తుతెలియని యువకుడి మృతి
గాంధీ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి చికిత్స తీసుకుంటూ చనిపోయాడు. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2 రోజుల క్రితం అనారోగ్యంతో గాంధీకి వచ్చిన యువకుడు (దాదాపు 35) ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. సదరు యువకుడు ట్రీట్మెంట్ పొందుతూ బుధవారం చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఎలాంటి వివరాలు లభించకపోవడంతో డెడ్ బాడీని గాంధీ మార్చురికి తరలించారు.