మణుగూరు స్పెషల్ ట్రైన్లో దారుణం
మణుగూరు స్పెషల్ ట్రైన్లో దారుణం జరిగింది. హైదరాబాద్లో ఉంటున్న కూతురుని చూసేందుకు రమణమ్మ 23న బళ్లారి సమీపంలోని ఓ స్టేషన్లో రైలు ఎక్కింది. 24న రైలు సికింద్రాబాద్ చేరుకుంది. స్టేషన్లో ఎదురుచూస్తున్న అల్లుడు రైలులోని బాత్రూంలో అత్త మృతదేహం చూసి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రోహిత్ అనే వ్యక్తి హత్య చేసి రూ.25 వేల నగదు, సెల్ఫోన్ అపహరించినట్లు గుర్తించి మంగళవారం అరెస్ట్ చేశారు.