ఇల్లందు: డీసీఎం వ్యాన్, బైకు ఢీకొని ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు
ఇల్లందు-మహబూబాద్ రోడ్డు ఇల్లందు జెండాల వాగు సమీపంలో ఆదివారం ద్విచక్ర వాహనం, డీసీఎం వ్యాన్ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందగా, ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మరణించిన వ్యక్తి లచ్చగూడెం గ్రామానికి చెందిన నరేష్ గా స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.