నిషేధిత ఆన్ లైన్ మట్కా ఆడుతున్న వ్యక్తి అరెస్ట్
ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా మంగళవారం కాగజ్నగర్ పట్టణంలోని నౌగాం బస్తిలో టాస్క్ ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో ఎస్కే ఆజిల్ ఆన్ లైన్ మట్కా ఆడుతూ పట్టుబడ్డాడు. అతని వద్ద నుండి నగదు, ఒక సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.