హుస్నాబాద్: విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి గ్రంథాలు అవసరం
నేటి బాలలే రేపటి పౌరులని, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి గ్రంథాలు అవసరమని సిద్ధిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. గ్రంథాలయాలు కనిపించే ఆలయాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. గ్రంథాలయాలు ప్రతీ ఒక్కరూ ఉపయోగించుకుని ఉన్నతంగా ఎదగాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రంథాలయాలు వృద్ధిలోకి వచ్చేలా కృషి చేస్తామన్నారు.