సిద్దిపేట: నిరుపేదలకు విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి ఇవ్వాలి
విద్యా, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి అనే ఈ 5 డిమాండ్లను ప్రజలకు ఉచితంగా అందించాలని, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు బోయిని సదన్ మహారాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రవిబాబు, బిట్ల జ్యోతి, ర్యాగట్ల చందు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.