కేసీఆర్ పై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు మద్దతిస్తే.. దాన్ని కేసీఆర్ పెట్టుబడిగా మార్చుకున్నారని అన్నారు. పదేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, కేసీఆర్ కుటుంబం మాత్రం ధనికులు అయ్యారని మండిపడ్డారు. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేశారని విమర్శించారు. ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన 'ద ఇండియన్ ఎక్స్ప్రెస్ అడ్డా' కార్యక్రమంలో సీఎం వ్యాఖ్యలు చేశారు.