యాదాద్రి థర్మల్ ప్లాంట్ భద్రతపై అధికారులు పూర్తిగా విఫలం
థర్మల్ పవర్ ప్లాంట్ కు భద్రత కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, దొంగతనానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలోని యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పవర్ ప్లాంట్ లో ఇప్పటికి రెండుసార్లు దొంగతనం జరిగిన అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు.