ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమను ఖాళీ చేయమంటున్నారని శివన్నగూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో ముంపుకు గురవుతున్న నర్సిరెడ్డిగూడెం గ్రామస్తులు శుక్రవారం రిజర్వాయర్ పనుల వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు, కాంట్రాక్టర్ తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. 32 మందికి ఇళ్ల స్థలాలు, 15 మందికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చే వరకు ఖాళీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.