చండూరులో బీఆర్ఎస్ ధర్నా
రైతులకు ఎకరానికి పదిహేను వేలు రైతు భరోసా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందంటూ ఆదివారం చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసనలు చేపట్టారు. రైతు భరోసా వెంటనే విడుదల చేయాలంటూ రోడ్డుపై బైటయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చేతకాని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.