Nov 08, 2024, 17:11 IST/
కేసీఆర్.. కుక్క చావు చస్తావ్: సీఎం రేవంత్ రెడ్డి
Nov 08, 2024, 17:11 IST
TG: మూసీ నది ప్రక్షాళనకు కేసీఆర్ అడ్డు పడితే కుక్క చావు చస్తారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నీ కూతురు కవిత 3 నెలలు జైలుకు వెళ్తేనే నీకు దు:ఖం వచ్చింది. మా బిడ్డలు కాలు వంకర, నడుము వంకరతో పుడితే వాళ్లను ఇంట్లో మంచానికి కట్టేసి తల్లులు పనులకు వెళ్తున్నారు. వాళ్ల దు:ఖం నీకు కనిపించట్లేదా? నువ్వు మూసీకి అడ్డు పడితే ఆ పాపం తగిలి కుక్క చావు చస్తావ్. దిక్కు లేని చావు చస్తావ్' అని మండిపడ్డారు.