

హయత్ నగర్: ఇంగ్లీష్ టీచర్ నిర్వాకం
హయత్ నగర్ భాగ్యలత శ్లోక స్కూల్ లో శుక్రవారం దారుణం వెలుగుచూసింది. 8వ తరగతి స్టూడెంట్స్ తో ఇంగ్లీష్ టీచర్ పాషా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వారిపై చేయి చేసుకున్నాడని వాపోయారు. తల్లిదండ్రులు స్కూల్ కు చేరుకుని ఇంగ్లీష్ టీచర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగులో మాట్లాడినందుకే చేయి చేసుకున్నానంటూ టీచర్ తప్పించుకునే ప్రయత్నం చేశారని విద్యార్థుల తల్లితండ్రులు వాపోయారు. ఘటనపై పోలీసుకు దర్యాప్తు చేస్తున్నారు