
అంబర్ పేట్: కార్యకర్త పాడే మోసిన ఎమ్మెల్యే
గొల్నాక కూరగాయల మార్కెట్ హనుమాన్ నగర్ కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గొల్నాక శ్యామ్ అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. ఆదివారం జరిగిన అయన అంత్యక్రియల్లో అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొని శ్యామ్ పాడే మోశారు. గతంలో శ్యామ్ మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీకి క్రియాశీలక సేవలందించారు. శ్యామ్ అంతిమయాత్రలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.