చాదర్ ఘాట్: మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్ళు కూల్చోద్దు
మూసీ ప్రక్షాళన, అభివృద్ది పేరుతో పేదల ఇళ్ళు కూల్చోద్దని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్ చేశారు. ఆప్ ప్రతినిధుల బృందం శుక్రవారం చాదర్ ఘాట్ లో కూల్చివేసిన పేదల ఇళ్లను పరిశీలించి బాధితులను పరామర్శించారు. మూసి ఒడ్డున దశాబ్దాలుగా ఉంటున్న పేద ప్రజలు ఆక్రమణ దారులు కాదని మున్సిపల్ పన్నులు, విద్యుత్ బిల్లులు కడుతూ జీవిస్తున్నారని తెలిపారు.