తెలంగాణ పోలీసులకు సీఎం శుభవార్త
సైనిక్ స్కూల్ మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు పిల్లల కోసం ప్రత్యేకంగా 50 ఎకరాల్లో స్పెషల్ రెసిడెన్షియల్ స్కూల్ ను రాబోయే రెండేళ్లలో ఏర్పాటు చేస్తామని, దేశంలోనే అద్భుతంగా తీర్చిదిద్దుతామని, పోలీస్ స్కూల్ ఏర్పాటు కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇదే వేదిక నుంచి డీజీపీకి ఆదేశాలిస్తున్నాన్నారు. బుధవారం తెలంగాణ పోలీస్ అకాడమిలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.