సంగారెడ్డి: విద్యార్థుల నమూనాలు అద్భుతం
విద్యార్థులు తయారుచేసి తీసుకువచ్చిన నమూనాలు చాలా అద్భుతంగా ఉన్నాయని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి లోని సెంట్ అంథోనీ పాఠశాలలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను గురువారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ మూడు రోజులపాటు జరిగే వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థులు తమ ప్రతిభను చూపాలని చెప్పారు. ఉత్తమంగా ఉన్న వాటిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారని పేర్కొన్నారు.