దుర్గామాత ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోండి: ఏసీపీ
రాబోవు దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చిలకలగూడ ఏసీపీ జైపాల్ రెడ్డి శనివారం దుర్గామాత మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. దుర్గామాత ఉత్సవ ఊరేగింపులో, మండపాల వద్ద డిజేలు పెట్టవద్దని, క్రకర్స్ కల్చవద్దని, జనాలను ఇబ్బంది కలిగించే పనులు చేయకూడదని ఏసీపీ వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తి భావంతో నిర్వహించుకోవాలని సూచించారు.