

సికింద్రాబాద్ కోర్టులో న్యాయవాదుల ఆందోళన
సికింద్రాబాద్ సివిల్ కోర్టు ముందు సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదులు ఆందోళన చేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టు మహిళా న్యాయమూర్తిపై దాడి చేసిన ఘటన నిరసిస్తూ న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. న్యాయాన్ని రక్షించే న్యాయమూర్తులపైనే దాడులు జరగడం అమానుషమైన చర్య అని పేర్కొన్నారు. న్యాయమూర్తులను కాపాడేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.