
సికింద్రాబాద్: కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో పలు కీలక అంశాలు ఆమోదం
కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో మంగళవారం పలు కీలక అంశాలు చర్చించి ఆమోదించారు. తిరుమలగిరి లాల్ బజార్ లోని కమిటీ హాల్ పునరుద్ధరించాలని, జీహెచ్ఎంసీలో మాదిరిగానే బహుళ అంతస్తుల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని, కంటోన్మెంట్ లో బోరింగ్ లకు బోర్డు కరెంట్ బిల్లులు చెల్లించాలని, అభివృద్ధి పనులు ప్రజలకు చేకూర్చాలని బోర్డులో తీర్మానం చేశారు. బ్రిగేడియర్ ఆధ్వర్యంలో జరిగిన బోర్డు సమావేశానికి పలువురు నాయకులూ పాల్గొన్నారు.